18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.. తెలంగాణ పోలీస్ హెచ్చరికలు ఇవే

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధిలో తాజాగా ఓ ఘోర ప్రమాదం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు స్నేహితులతో కలిసి అతివేగంగా కారు నడపడం వల్ల ప్రమాదం జరిగింది.

Update: 2024-07-18 10:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధిలో తాజాగా ఓ ఘోర ప్రమాదం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు స్నేహితులతో కలిసి అతివేగంగా కారు నడపడం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మిగితా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాలుడితో పాటు కారు యజమాని అయిన తండ్రిపై కఠిన సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ పోలీస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

అలా మైనర్‌లకు వాహనలు ఇస్తే యజమానిపై కూడా అత్యంత కఠినమైన కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా మీ జీవితాలే కాదు ఎదుటి వారి కుటుంబాలు సైతం అంధకారంలోకి వెళ్తాయని పేర్కొంది. పిల్లలను గమనిస్తూ, అపరిపక్వ పనులు చేయకుండా చూడడం తల్లిదండ్రుల బాధ్యత అని ట్వీట్ చేసింది. 

Tags:    

Similar News