విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండి! నిరుద్యోగులకు సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

నిరుద్యోగులారా..! విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

Update: 2024-05-19 06:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులారా..! విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలంటూ కాంబోడియాకు తీసుకెళ్తూ.. నిరుద్యోగులతో చైనా కంపెనీలు బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నాయని తెలిపారు. వారిని నిర్బంధించి అక్కడి నుంచి ఇండియాలో జాబ్‌ ఫ్రాడ్స్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ స్కామ్స్‌, క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. వ్యసనాలకు బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నిరుద్యోగులను నమ్మించి కాంబోడియాకు విక్రయిస్తున్న ముఠాను తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కమిషనరేట్‌ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్‌ చేశారని, కాంబోడియాకు దాదాపు 5 వేల మందిని వారు పంపించారన్నారు. ఇలాంటి ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగం ఇస్తామని అనగానే నమ్మి.. విదేశాలకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకోకండని సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..