వారిపై నింద మోపడం సిగ్గుచేటు.. కేసీఆర్ వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైర్
పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైరయ్యారు. అడవులు ఎవరి వల్ల నాశనమయ్యాయో ఆయన సమాధానం చెప్పాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి అటవీ సంపదను రియల్టర్లకు అప్పగించినది వాస్తవం కాదా అని ఆమె నిలదీశారు. అలాంటిది గిరిజనులపై నిందలు మోపడం వెనుక ఆంతర్యమేంటని డీకే అరుణ ప్రశ్నించారు. వారిపై నింద మోపడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. పూటకో మాట మాట్లాడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటైందని డీకే అరుణ మండిపడ్డారు. త్వరలో పింక్ పార్టీనీ ప్రజలు బొంద పెడుతారని విరుచుకుపడ్డారు.