కేసీఆర్‌కు దమ్ముంటే ఈటలపై పోటీ చేయాలి.. డీకే అరుణ సవాల్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బిడ్డ తప్ప ఇంకే మహిళ కనిపించదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బిడ్డ తప్ప ఇంకే మహిళ కనిపించదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖను మహిళలకు ఇచ్చిన ఘనత ప్రదాని మోడిదని హర్షం వ్యక్తంచేశారు. ఇవాళ ఆమె నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో 33% మహిళ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్ష చేశారని, తెలంగాణలో 33% సీట్లు మహిళలకు ఇవ్వలేదని మీ నాన్నను ఎందుకు అడగట్లేదు కవిత అని నిలదీశారు. మహిళల మీద నగరం నడబొడ్డున అనేక అకృత్యాలు జరిగిన సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పని ఏ అధికారి మాట్లాడలేదన్నారు.
కేసీఆర్ సర్కార్‌లో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని, ఆఫీసర్‌లు సీఎం కళ్ళు మొక్కి ఐఏఎస్‌ల గౌరవం తీస్తున్నారని మండిపడ్డారు. బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, అయిన ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేసీఆర్ వాళ్లను ప్రకటించారని అన్నారు. బీసీలకు 22సీట్లు మాత్రమే ఇచ్చారని, బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ బీఅర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, బీజేపీని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఒక బీసీని కాదని సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని, కేసీఆర్ కు దమ్ముంటే అక్బరుద్దీన్ ఓవైసీ పై లేదంటే బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై పోటీ చేయాలని సవాల్ చేశారు.