అలా చేసి వివాదంలో చిక్కుకున్న గద్వాల TRS ఎమ్మెల్యే.. (వీడియో)

జోగులాంబ గద్వాల జిల్లాలో మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమంది.

Update: 2022-11-22 12:09 GMT

దిశ, గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురుకుల పాఠశాలల అధికారి గల్ల పట్టుకొని.. లం.. కొడకా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాలలోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల తాత్కాలిక భవన ప్రారంభోత్సవాన్ని సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య హాజరు అయ్యారు. ముందుగా ఆమెను గేటు వద్ద ఉన్న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించవలసిందిగా అధికారులు కోరారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ప్రారంభిద్దాం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చెప్పగా.. ఎమ్మెల్యే రావడానికి ఆలస్యం అయ్యేటట్లు ఉందని.. సార్ వచ్చి లోపల గదులను ప్రారంభిస్తారని చెప్పడంతో ఆమె అందుకు సమ్మతించి రిబ్బన్ కట్ చేశారు.

కొంతసేపటికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తదితరులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకోగా గేటు వద్ద ఉన్న రిబ్బన్ కట్ చేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారు అని అధికారులను ప్రశ్నించడంతో.. జడ్పీ చైర్పర్సన్ అందుకు క్షమాపణ కోరారు. ఈ క్రమంలో గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ వెంగల్ రెడ్డి కల్పించుకొని ఏదో సర్ధిచెపుదామనే వరకు... ఎమ్మెల్యే మరింత ఆగ్రహానికి గురై అతని గల్లా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. లం... కొడకా అంటూ దుర్భాషలు ఆడారు. ఈ సంఘటన బయటకు పోక్కకుండా అధికార పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికిని.. విషయము బహిర్గతం కావడంతో.. ఎమ్మెల్యే తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

https://youtu.be/jt956gv7wOc

Tags:    

Similar News