KCR : 30 ఏళ్ల క్రితం కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ పిక్స్ చూశారా?

కొండగట్టుపై ఫోకస్ చేసిన కేసీఆర్ దేవాలయంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-02-16 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొండగట్టుపై ఫోకస్ చేసిన కేసీఆర్ దేవాలయంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొండగట్టులో పర్యటించిన కేసీఆర్ అవసరమైతే మరో రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లు కేటాయించుకుందామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సీఎం కేసీఆర్ 30 ఏళ్ల కిందట కొండగట్టులో పర్యటించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్, సోదరి కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్ రావు, శశికళతో కలసి కొండగట్టుపై దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు టర్న్ వచ్చింది. కుటుంబ సభ్యులంతా అనేక సార్లు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకన్నాం. కొండగట్టు వ్యూపాయింట్ నుంచి అప్పటి మెమొరెబుల్ పిక్స్ అంటూ ట్వీట్‌కు కామెంట్ జత చేశారు. కాగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News