Dharmapuri Arvind: 'కేసీఆర్ ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది' ఎంపీ అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

కేటీఆర్ పాదయాత్ర అంశంపై స్పందించిన ఎంపీ అర్వింద్.. కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యేలు చేశారు.

Update: 2024-11-03 07:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ పాదయాత్ర పేరుతో గ్రామాల్లోకి వస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ (KCR) ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని దాంతో పార్టీలో సీనియర్ నేత అయిన హరీశ్ రావు (Harish Rao) పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ (KTR) ఆయన కంటే ముందే తన పాదయాత్రను డిక్లేర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో నాయకత్వం కోసం జరుగుతున్న ఫ్యామిలీ గొడవ అన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ వాళ్లిద్దరి మధ్యలో బతుకమ్మ రావాల్నా అనేది గొడవ నడుస్తున్నదన్నారు.

ఆదివారం నిజామాబాద్ లో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. కేటీఆర్ ను పాదయాత్ర చేస్తే ఎవరొద్దన్నారని ప్రశ్నించారు. పదేళ్లపాటు విచ్చలవిడిగా పాలన సాగించి ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు?, ఎంత మంది దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇచ్చారో చూపిస్తారా? అని ప్రశ్నించారు. కంపెనీల వద్ద కమీషన్లు దండుకున్నారని కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రాజెక్టులు లేకున్నా పైపుల కోసం పేమెంట్లు చేశారని ధ్వజమెత్తారు. దీనికంటే విచ్చలవిడి తనం మరొకటి ఉంటుందా కేటీఆర్ అన్నారు. ప్రజల అభీష్టం మేరకే పాదయాత్ర అంటున్న కేటీఆర్ ను ఏ ప్రజలు పాదయాత్ర చేయమన్నారన్నారని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉండి కళ్లు నెత్తికెక్కి, కాళ్లు గాల్లో వేలాడుతున్నాయని ఇకనైనా తీరు మార్చుకుని భూమిమీదకు రావాలని ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్తే కేటీఆర్ దాన్ని పాదయాత్ర అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ చేసిన అఘాయిత్యాలు ప్రజలు మరువరని మేము మరవనివ్వమన్నారు.

కాంగ్రెస్ చేతికి ఖాళీ చిప్ప ఇచ్చిందిమీ అయ్య కాదా?:

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి ఖాళీ చిప్పను చేతికిచ్చింది మీ అయ్య కేసీఆర్ కాదా కేసీఆర్ అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని తెలిసి కూడా కాంగ్రెస్ దొంగ వాగ్ధానాలు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాగ్ధానాలపై మల్లికార్జున ఖర్గేనే వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేసి నాశనం అయ్యారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి బాటలోనే నడుస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా దేవుల్లపై ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతులను నట్టేట ముంచేశారని ధ్వజమెత్తారు. యాదగిరి గుట్ట నుంచి సిద్ధులగుట్ట వరకు ఏ గుట్టను వదలకుండా ఈ ప్రపంచంలో తానే పెద్ద హిందువును అన్నంతగా ఒట్లు వేసి వాటిని గట్టుపై పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాకంటే ప్రజలకే బాగా తెలుసన్నారు. భవిష్యత్ లో సర్పంచ్ ఎన్నికలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అథః పాతాళంలోకి తొక్కుతారన్నారు. కులగణన వేగంగా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిందని ఎన్నికలు డీలే చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎంఐఎం ఓ క్యాన్సర్:

ఎంఐఎం (MIM Party) పార్టీ మన దేశానికి పట్టిన క్యాన్సర్ అని క్యాన్సర్ వ్యాధికి ముఖం అనేది ఉంటే అది అసదుద్దీన్ ఓవైసీ  (Asaduddin Owaisi)అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ యాక్ట్ అంతా దుర్గార్మమైన చట్టం ఉండదని అందువల్లే కేంద్రం సవరణలు తీసుకు వస్తున్నదన్నారు. ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనన్నారు. ఓవైసీ బెదిరింపులు కేసీఆర్ ను మాత్రమే కాదు కాంగ్రెస్ ను కూడా బెదిరించినట్లేనని వీళ్లకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు.మూసీ విషయంలో అసదుద్దీన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ భుజంపై తుపాకిని పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గురిపెట్టారని విమర్శించారు.

Tags:    

Similar News