Telangana DGP : పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు
పోలీస్ శాఖ(Police Department)లో వరుసగా చోటుచేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యల(Police Suicides)పై డీజీపీ జితేందర్(DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : పోలీస్ శాఖ(Police Department)లో వరుసగా చోటుచేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యల(Police Suicides)పై డీజీపీ జితేందర్(DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యల ఘటనలను విశ్లేషిస్తే చాల వరకు వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పర్సనల్, ఫ్యామిలీ సమస్యలతో భావోద్వేగాలతో కొందరు పోలీసుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలకు పని ఒత్తిడి కూడా ఓ కారణమై ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగుల ఆత్మహత్యల నివారణకు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర రంగాల వారి సహకారం కూడా తీసుకుంటామన్నారు.
తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వాజేడు ఎస్సై సురేష్ గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకోగా.. మూడ్రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్, మరో యువకుడు చెరువులో శవాలై తేలారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కానిస్టేబుల్ సాయి సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మానస, ఇద్దరు పిల్లలు యశ్వంత్ (11,) ఆశిరిత్ (9) పురుగుల మందు తాగించి ఆపై తాను ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసు ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు పోలీస్ శాఖకు అప్రతిష్టగా తయారైంది.