శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి శనివారం రాత్రి నుంచి భక్తలు పొటెత్తారు.
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి శనివారం రాత్రి నుంచి భక్తలు పొటెత్తారు. వింటర్ సీజన్ ప్రారంభం కావడం, శని ఆదివారాల్లో సెలవు ఉండటంతో శుక్రవారం సాయంత్రం భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. కాగా మార్గమధ్యంలో పర్యాటక ప్రాంతాలను చూసుకొని శనివారం సాయంత్రం వరకు భారీగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. దీంతో ఆదివారం ఉదయం ఒక్కసారిగా పాతాళ గంగ వద్ద భక్తుల తాకిడి పెరిగిపోయింది. మొక్కులు తీర్చుకున్న అనంతరం భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. దీంతో ఉదయాన్నే శ్రీశైలం(Srisailam ) క్షేత్రంలో ఉన్న సగానికి పైగా కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో స్వామి వారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ సిబ్బంది స్పష్టం చేశారు. అలాగే పెరిగిన భక్తుల రద్ధీ దృష్టిలో పెట్టుకొని లడ్డూ, పులిహోర ప్రసాదాలు సైతం పెంచినట్లు తెలిపారు.