బిగ్ బ్రేకింగ్.. చిరంజీవి ఇంటికి హీరో అల్లు అర్జున్
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2(Pushpa-2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట(Stampede) జరిగి ఓ మహిళ మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హీరో అల్లు అర్జున్(Allu Arjun) పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ర్యాలీగా థియేటర్ లోకి రావడం కారణంగా తొక్కిసలాట జరిగిందని వివరిస్తూ.. ఆయన్ను శుక్రవారం అరెస్ట్(arrest) చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించడం.. తెలుగు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. సినీ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
ఇదిలా ఉంటే.. తన అరెస్టుపై అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించగా.. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చినప్పటికి పలు టెక్నికల్ కారణాల వల్ల.. శుక్రవారం రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు. అనంతరం శనివారం ఉదయం ఆయన చంచల్ గూడ జైలు(Chanchal Guda Jail) నుంచి బయటకు వచ్చాడు. దీంతో సినీ ప్రముఖులు మొత్తం.. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. పోలీసులు అరెస్ట్ చేయడం తో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా ప్రముఖులు అందరు అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలిచారు. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున హీరో అల్లు అర్జున్ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని కలిసేందుకు బయలు దేరాడు. అలాగే పుష్ప-2 సినిమా విజయం తర్వాత మొట్టమొదటి సారి స్వయంగా అల్లు అర్జున్.. చిరంజీవి ఇంటికి వెళ్తుండటం ప్రత్యేకతను సంతరించుకోగా..తన కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని అల్లు అర్జున్ కలిసి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది.