మోహన్ లాల్ ‘బరోజ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. పోస్ట్ వైరల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

Update: 2024-12-15 08:43 GMT

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. కానీ ఊహించినంత హిట్స్ తన ఖాతాలో పడకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్’(Barroz3D : Guardian of Treasure). ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. పూర్తిగా 3డిలో వస్తున్న ఈ మూవీ మోహన్ లాల్ తన సొంతం నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్(Aashirvaad Cinemas) బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్‌(Perumbavoor)తో కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో దీనిని మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేస్తున్నారు.

అయితే ఇందులో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించగా.. తుహిన్ మీనన్(Tuhin Menon), కల్లిర్రోయ్ టిజియాఫెటా, సీజర్ లోరెంటే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇది మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే అన్ని భాషల్లో ‘బరోజ్’ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 16న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

Tags:    

Similar News