CM Revanth Reddy : నెహ్రు ఆకాంక్షల మేరకు బాలల అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-11-14 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : నవ భారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(Nehru's) ఆకాంక్షల మేరకు నేటి బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. స్వతంత్ర భారత రూపశిల్పి, దేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ బాలల దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బాలబాలికలకు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని బోధించిన పండిట్ నెహ్రూ ఆకాంక్షల మేరకు నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. నెహ్రూ గారి సేవలను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించారు.

దేశ తొలి ప్రధానిగా పండిట్ నెహ్రు పారిశ్రామిక, ఇరిగేషన్, ఆర్థిక రంగాలలో చేసిక కృషి ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేసిందని కొనియాడారు. నెహ్రు స్ఫూర్తితో రేపటి పౌరుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, నూతన సమగ్ర విద్యా విధానం రూపకల్పన, ఐటీఐల అప్ గ్రేడేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల పెంపు వంటి విధానాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 

Tags:    

Similar News