ఇంతకంటే ఆనందం మాకు మరొకటి లేదు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాడు కొలువుల కోసం తెలంగాణ పోరాటం జరిగిందని గుర్తు చేశారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగణలో.. పదేళ్లలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నిరుద్యోగులకు కొలువులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. డీఎస్సీని ప్రకటిస్తే ధర్నాలు చేసి ఆపించాలని కుటిల ప్రయత్నాలు చేశారని. వాళ్ల కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టి ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా భట్టి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇస్తున్నామని.. ఇంతకంటే ఆనందం మాకు మరొకటి లేదని..ముందుగా చెప్పిన సమయానికి నియామక పత్రాలు అందిస్తున్నామని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో చెప్పుకొచ్చారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.