Bhatti Vikramarka : రాహుల్‌ గాంధీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాంచీలో సమావేశం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.

Update: 2024-10-19 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా భట్టి విక్రమార్క ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్న ప్రతిపక్ష నేత, ఏఐసీసీ సెక్రటరీ రాహుల్ గాంధీని సాదరంగా భట్టి విక్రమార్క శాలువ కప్పి ఆహ్వానించారు.

ఇండియా కూటమిలో భాగమైన.. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ పక్షాలతో చర్చలు, సమన్వయ సమావేశం నిర్వహించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశిస్తున్న స్థానాల పై కీలక చర్చలు ఈ సమావేశంలో జరిపారు.


Similar News