మేమొచ్చి కేవలం 8 నెలలే.. అప్పుడే మాపై మాటల దాడి: డిప్యూటీ సీఎం భట్టి

2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్

Update: 2024-07-27 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ అనంతరం భట్టి ఆన్సర్ ఇస్తూ.. పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయకుండా వెళ్లినవారు ఇప్పుడు మాపై మాటల దాడి చేస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్‌ను విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చి 8 నెలలే అయ్యిందని అందులో 3 నెలలు ఎన్నికల కోడ్‌లోనే గడిచిపోయిందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తు్న్నట్లుగా బడ్జెట్ ఊహాజనితంగా ఎక్కడుందని ప్రశ్నించారు.

వ్యవసాయం కోసం రూ.72 వేల కోట్లు కేటాయించడం తప్పా..? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించడం తప్పా అని ప్రతిపక్షాలను ఉతికారేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎస్సీ, ఎస్టీ కోసం బడ్జెట్‌లో రూ. 17,056 కోట్లు కేటాయించామని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, 30 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. మరో 35 వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, 4 నెలల్లోనే 65 వేలకు పైగా జాబ్‌లు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. రుణమాఫీపై కొందరు ఎగతాళి చేశారని, కానీ ఎంత కష్టమైనా రుణమాఫీపై ముందుకెళ్తుతున్నామని స్పష్టం చేశారు.


Similar News