Deputy CM Bhatti: లగచర్ల నిర్వాసితులకు భారీ గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన!

ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న లగచర్ల (Lagacharla) వాసులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.

Update: 2024-11-13 12:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న లగచర్ల (Lagacharla) వాసులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు నిర్వాసితులకు భారీ ఎత్తున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాల వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొదని రైతులకు పిలుపునిచ్చారు. కోడంగల్ (Kodangal) ప్రాంతం అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కంకణం కట్టుకున్నారని తెలిపారు.

పరిశ్రమలు వస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి ఊపందుకుంటుందని.. అందుకు భూసేకరణ తప్పనిసరి అన్ని భట్టి అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భూములు కోల్పోతున్న అన్నదాతల ఆక్రందన ఎలా ఉంటుందో తమకు కూడా తెలుసని పేర్కొన్నారు. నిర్వాసితులందరికీ భారీ ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇళ్లను సైతం కోల్పోతున్న వారికి మంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.

Tags:    

Similar News