Deputy CM Bhatti: పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

ప్రభుత్వ పథకాల (Government Welfare Schemes)కు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారాయి.

Update: 2025-01-24 06:05 GMT
Deputy CM Bhatti: పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పథకాల (Government Welfare Schemes)కు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జబితాలో తమ పేర్లు లేవని పలువురు నేరుగా అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి, కాంగ్రెస్ (Congress) నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన వారి పేర్లు మాత్రమే తుది జాబితాలో వస్తున్నాయంటూ జనం ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితా ఫైనల్ లిస్ట్ కాదని కామెంట్ చేశారు. ఆ జాబితాలు కేవలం ఇదిరమ్మ ఇండ్లు (Indiramma Houses), కొత్త రేషన్ కార్డు (New Ration Cards) కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల జాబితా అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు (New Ration Cards)లు మంజూరు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  

Tags:    

Similar News