మరో డీఎస్సీ వేస్తామని డిప్యూటీ CM భట్టి హామీ.. బీఆర్ఎస్ కౌంటర్
రాష్ట్రంలో డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి మరో డీఎస్సీ వేస్తామని కాసేపటి క్రితం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి మరో డీఎస్సీ వేస్తామని కాసేపటి క్రితం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. భట్టి గారు.. ఇంకో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాము అని మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పారా లేక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పారా? అని ప్రశ్నించింది. ఈ విషయం సెక్రటేరియట్లో చెప్పకుండా.. గాంధీభవన్ లో ఎందుకు చెబుతున్నారు..అని అనుమానం వ్యక్తం చేసింది. మిమ్మల్ని అభ్యర్ధులు ఎలా నమ్మాలి? అని ప్రశ్నించింది. అయినా విద్యాశాఖను దగ్గర ఉంచుకుని నిరుద్యోగులను అడ్డగోలు మాటలతో అవమానించిన రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విషయం మాట్లాడడు? అంటూ ఫైర్ అయింది. ఇది కేవలం నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం అని ఆరోపించింది.