LRS: ఎల్ఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి సమీక్ష.. కీలక ఆదేశాలు

ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

Update: 2024-07-26 11:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా ఇవాళ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న కార్యాల‌య‌లంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేంశంలోనే ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌పై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు నిర్వ‌హించారు. ఎల్ఆర్ఎస్ వ‌ల్ల ప్ర‌జల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారులకు భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

ఎల్ఆర్ఎస్ అనుమ‌తుల కోసం ప్ర‌జ‌లు చేసుకున్న ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచ‌న చేశారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్ర‌త్యేకంగా టీముల‌ను రూపొందించుకోవాల‌ని ఆయన చెప్పారు. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డిప్యుటేష‌న్ తీసుకోవాల‌ని సూంచారు. ఈ స‌మీక్షలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ రామ‌కృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ నవీన్ మిట్ట‌ల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట అమ్రపాలి, గృహ‌నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి విపీ గౌత‌మ్ తదిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News