చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేత

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ అధికారులు పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Update: 2023-05-12 07:47 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శుక్రవారం ఉదయం మున్సిపాలిటీ అధికారులు పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.చిత్రపురి కాలనీలో కొందరు బిల్డర్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుపుతున్న విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులను వెంటబెట్టుకుని మున్సిపల్ అధికారులు కాలనీకి చేరుకున్నారు. అక్రమ కట్టడాలను గుర్తించి జేసీబీలతో కూల్చివేశారు. దీంతో కొందరు బిల్డర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకునే యత్నం చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read.

మహిళా కౌన్సిలర్లకు బదులు భర్తలు.. కలెక్టర్ ప్రొగ్రాంలోనూ వారిదే పెత్తనం

Tags:    

Similar News