ఢిల్లీ లిక్కర్ స్కాం.. నిందితుల బెయిల్ పై నో స్టే!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నవంబర్ 14న ఇద్దరికీ సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఈ బెయిల్ మంజూరును ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.

Update: 2022-11-24 09:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నవంబర్ 14న ఇద్దరికీ సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఈ బెయిల్ మంజూరును ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటీషన్ పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ పిటిషన్ పై స్పందించాలని ఇరువురికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో విచారణకు సహకరించడం లేదని విజయన్ నాయర్, సంతోష్ బోయినపల్లి సహకరించడం లేదని మొదట వీరిని ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత కస్టడీలోకీ తీసుకుంది కస్టడీ ముగియడంతో వీరికి జ్యూడీషియల్ రిమాండ్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు పంపింది. ఆ క్రమంలోఈ నె 21న రౌస్ అవెన్యూ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయగా ఈ బెయిల్ పై సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా ప్రస్తుతం అభిషేక్, విజయ్ నాయర్ ఈడీ కస్టడీలోనే ఉన్నట్టు ఈడీ కోర్టుకు తెలిపింది.

Tags:    

Similar News