సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ మౌనం వహించిన MLC కవిత!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ ఎంక్వయిరీకి వెళ్ళడానికి ముందురోజు నుంచే న్యాయవాదులతో, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో సుదీర్ఘంగా చర్చించిన కవిత తొమ్మిది గంటల పాటు విచారణ పూర్తయిన తర్వాత వారితో కలిసే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

Update: 2023-03-12 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ ఎంక్వయిరీకి వెళ్ళడానికి ముందురోజు నుంచే న్యాయవాదులతో, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో సుదీర్ఘంగా చర్చించిన కవిత తొమ్మిది గంటల పాటు విచారణ పూర్తయిన తర్వాత వారితో కలిసే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈడీ విచారణలో లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి ఇచ్చిన సమాధానాలపై కవిత సైలెంట్‌గా ఉండిపోయారు.

విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించవద్దంటూ అధికారులు ఇచ్చిన సూచన మేరకే కవిత మౌనంగా ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇదే స్కామ్‌లో గతేడాది డిసెంబరు 11న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఏడున్నర గంటల పాటు సీబీఐ విచారించిన తర్వాత కూడా కవిత వాటిని బహిర్గతం చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు ఈడీ విషయంలోనూ అదే రిపీట్ అయింది.

కానీ, సీబీఐ విచారణ ముగిసిన వెంటనే ప్రగతి భవన్ వెళ్ళిన కవిత ఆ వివరాలన్నింటినీ తండ్రి కేసీఆర్‌తో పంచుకున్నారు. ఇప్పుడు ఈడీ విషయంలోనూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో ఢిల్లీలోనూ, విమాన ప్రయాణం సమయంలోనూ షేర్ చేసుకున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో తొమ్మిది గంటల పాటు విచారించిన తర్వాత ఈ నెల 16న మరోసారి ఎంక్వయిరీలో ఈడీ ఏయే అంశాలపై ఫోకస్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: 9 గంటలు.. వందల ప్రశ్నలు.. మరీ MLC కవిత ఏం సమాధానం చెప్పారంటే..!

Tags:    

Similar News