Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవిత చార్జ్‌షీట్‌పై నేడు విచారణ.. బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్.. టెన్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-14 02:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. అయితే, ఆ చార్జ్‌షీట్‌లో గోవా ఆప్ అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామంతో కేసులో అసలు ఏం జరుగుతోందని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌‌ సింగ్‌ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అదే చార్జ్‌షీట్‌పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..