జ్యుడీషియల్ కస్టడీకి MLC కవిత మాజీ ఆడిటర్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Update: 2023-02-11 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మద్యం పాలసీ కుట్రలో బుచ్చిబాబు భాగస్వామిగా ఉన్నారన్న అభియోగాలపై ఆయన్ను ఫిబ్రవరి 8న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనకు విధించిన మూడు రోజుల కస్టడీ ముగియడంతో బుచ్చిబాబును శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు సహా నిందితులతో కలిసి అనేక మీటింగ్ లలో పాల్గొన్నాడని, చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని అందువల్ల అతడిని మరింతగా ప్రశ్నించేందుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని సీబీఐ కోర్టును కోరింది. దీంతో కోర్టు బుచ్చిబాబును 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తాను బెయిల్ కోసం దరఖాస్తు చేయడం లేదని తనకు టాబ్లెట్స్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సీబీఐ, ఈడీ దుకుడు పెంచాయి. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును స్పీడప్ పేశాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News