Delhi Liquor Scam : లిక్కర్‌ కేసు విచారణ వాయిదా.. కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా

ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై శుక్రవారం ఢిల్లీ రౌస్ విచారణ జరిపింది.

Update: 2024-10-04 09:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్, విజయ్ నాయర్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్‌ 19కి కోర్టు వాయిదా పడింది.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కోర్టు విచారణలు జరుగుతున్నాయి.


Similar News