అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి .. మాజీ మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు
అమెరికా(America) అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోన్న క్రమంలో రిపబ్లికన్ పార్టీ(Republican Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 267 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America) అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోన్న క్రమంలో రిపబ్లికన్ పార్టీ(Republican Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 277 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలాగే.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) 224 ఎలక్ట్రోరల్ ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 270 ని దాటి వేయడంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారని ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(former minister KTR) పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. గతంలో అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందింస్తూ.. కమలా హారిస్.. నిజమైన అమెరికా అధ్యక్షురాలిగా కనిపిస్తుందని.. త్వరలో అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని చూడబోతున్నారని ట్వీట్ చేశారు. కాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో కమాలా హారిస్ ఓటమిపాలు కావడంతో కేటీఆర్ ట్వీట్‌ను స్క్రీన్ షాట్లు తీసి.. సెటైర్లు వేస్తున్నారు. మరోసారి కేటీఆర్ డ్రామా ఫెయిల్ అయిందని, కేటీఆర్ కేవలం పీఆర్ ప్రొడక్ట్ మాత్రమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కారణంగా ఇప్పుడు ట్రోల్స్ కు గురవుతున్నారు.
Read More..
US Elections 2024లో సత్తా చాటిన ఇండియన్ అమెరికన్స్