జూలై 10న ‘డీఈఈసెట్’.. దరఖాస్తు గడువు ఎప్పటివరకంటే..?

డీఈఈసెట్ పరీక్షను వచ్చే నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-06-24 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డీఈఈసెట్ పరీక్షను వచ్చే నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా దరఖాస్తు ఈనెల 30వ తేదీతో ముగియనుందని స్పష్టంచేశారు. ఈనెల 29, 30 తేదీల్లో తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్‌ను పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.


Similar News