DEE CET : డీఈఈ సెట్‌‌లో 12,032 మంది ఉత్తీర్ణత

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2024-07-24 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 12,032 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో 6644 మంది క్వాలిఫై అయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో 5204 మంది, ఉర్దూ మీడియంలో 364 మంది ఉత్తీర్ణత సాధించారు. డీఈఈసెట్‌ కోసం మొత్తం 17,595 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 15,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10న ఆన్‌లైన్‌ విధానంలో డీఈఈసెట్‌ పరీక్షను నిర్వహించారు. డీఈఈసెట్‌ మార్కులు, ర్యాంకు కార్డుల కోసం https://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని, గురువారం నుంచి అందుబాటులో ఉంటాయ‌ని కన్వీనర్‌ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News