దశాబ్ది వేడుకల సంబురం.. ప్రజాప్రతినిధులకు సర్కారు షాక్!

తెలంగాణ రాష్ట్రా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు సర్కార్​కు సంబురం మిగిల్చాగా సర్పంచులకు మాత్రం సంకటంగా మారాయి.

Update: 2023-06-23 01:59 GMT

తెలంగాణ రాష్ట్రా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు సర్కార్​కు సంబురం మిగిల్చాగా సర్పంచులకు మాత్రం సంకటంగా మారాయి. ప్రభుత్వం జూన్​ 2నుంచి 22వరకు నిర్వహించిన వేడుకలతో ఖర్చులు తడిసిమోపేడై స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పులు మిగిల్చాయని​ సర్పంచ్​లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు సర్కార్​ నిధులు కేటాయించినట్లు గొప్పలు చెప్పుకుంటుండగా అరకోరగా ఇచ్చిన నిధులు ఎక్కడికి సరిపోక అప్పుల అయ్యామని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల పండుగ వేడుకలకు హాజరైన ప్రజలకు చికెన్​తో భోజనం ఏర్పాటు చేయగా ఒక్క మనిషికి రూ.12 చొప్పున నిధులు సర్పంచ్​ల అకౌంట్​లో జమకావడంతో అవాక్కయ్యారు. చికెన్​కు భారీగా డిమాండ్​ ఉండడంతో ఆరోజు కిలో చికెన్​ ధర రూ.270 పలికింది. కిలో చికెన్​ రూ.270కి కొనుగోలు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తే సర్కార్​ జమ చేసిన డబ్బును చూసి సర్పంచ్​లు షాక్​ అవుతున్నారు. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన భోజనం డబ్బు రూ.12కు హోటల్​లో కనీసం చాయ్​ కూడా రావడం లేదని వాపోతున్నారు. సర్కార్​ సంబురాల పేరుతో సర్పంచులను అప్పుల పాలు చేసిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, కరీంనగర్​ బ్యూరో : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకలు సర్కార్​కు సంబురం మిగిల్చాగా సర్పంచులకు మాత్రం సంకటంగా మారాయి. ప్రభుత్వం జూన్​ 2నుంచి 22వరకు నిర్వహించిన వేడుకలతో ఖర్చులు తడిసియోపేడై స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పులు మిగిల్చాయని​ సర్పంచ్​లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు సర్కార్​ నిధులు కేటాయించినట్లు గొప్పలు చెప్పుకుంటుండగా ఖర్చులకు అరకోరగా ఇచ్చిన నిధులు ఎక్కడికి సరిపోక అప్పుల అయ్యామని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొర నిధులే...

తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం సందర్భంగా ప్రభుత్వం జూన్​ 2నుంచి 22వరకు దశాబ్ది ఉత్సవాల పేరుతో 20రోజుల పాటు వేడుకలు నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన తొమ్మిది ఏళ్లుగా చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ప్రతి రోజు ఒక్కొ అంశంపై ఉత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేసినట్లు చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందే వరకు అరకోరగా వచ్చాయని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో చెరువుల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మలు, బోనాలతో చెరువుల వద్దకు తరలివెళ్లి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామ సర్పంచ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఊరు ఊరు తరలివెళ్లి చికెన్​తో భోజనం చేశారు.

ప్రభుత్వం చెల్లించింది రూ.12చొప్పునే..

చెరువుల పండుగ వేడుకలకు హాజరైన ప్రజలకు చికెన్​తో భోజనం ఏర్పాటు చేయగా ఒక్క మనిషికి రూ.12 చొప్పున నిధులు సర్పంచ్​ల అకౌంట్​లో జమకావడంతో అవాక్కయ్యారు. చెరువుల పండగ రోజున చికెన్​కు భారీగా డిమాండ్​ ఉండడంతో ఆరోజు కిలో చికెన్​ ధర రూ.270 పలికింది. కిలో చికెన్​ రూ.270కి కొనుగోలు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తే సర్కార్​ జమ చేసిన డబ్బును చూసి సర్పంచ్​లు షాక్​ అవుతున్నారు.

రైతు దినోత్సవం రోజూ అదే తీరు...

వ్యవసాయ దినోత్సవం రోజున రైతు వేదిక వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు అక్కడికి వచ్చిన రైతులకు ప్రభుత్వ ఆదేశాలతో చికెన్​తో భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్కార్​ క్లస్టర్​కు రూ.47వేలు విడుదల చేయగా రైతు వేదిక ఉన్న సర్పంచ్​లకు ఖర్చు తడిసిమోపేడైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున జిల్లా కేంద్రాలకు మహిళలను తరలించడానికి రవాణా ఖర్చుతోపాటు పోలీసులు నిర్వహించిన 2కే రన్​కు యువకులను తరలించడానికి, విద్యుత్​, నీటిపారుదల వంటి దినోత్సవాలకు గ్రామాల్లోని ప్రజలను తరలించడానికి సర్పంచ్​ల ఖర్చులు భారీగా అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ దినోత్సవం రోజున గ్రామ పంచాయతీలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు దుస్తులు, బూట్లకు ఖర్చులు సైతం సర్పంచులకు గుదిబండగా మారాయి.

రూ.లక్షనుంచి రూ.2లక్షల వరకు..

సర్కార్​ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలు సర్పంచులకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చైందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకలను అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిర్వహించేలా చేశారని, తీరా డబ్బు చెల్లింపు విషయంలో మాత్రం అరకోరగా చెల్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన భోజనం డబ్బు రూ.12కు హోటల్​లో కనీసం చాయ్​ కూడా రావడం లేదని వాపోతున్నారు. సర్కార్​ సంబురాల పేరుతో సర్పంచులను అప్పుల పాలు చేసిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు రాష్ర్ట సర్కార్​కు సంబురం కాగా సర్పంచ్​లకు మాత్రం సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 

ముగిసిన దశాబ్ది ఉత్సవాలు.. నెక్ట్స్ ఆ ప్రోగ్రామ్స్‌పై సీఎం కేసీఆర్ ఫోకస్! 

Tags:    

Similar News