ఆ జిల్లాలో ఆగని గుండెపోటు మరణాలు.. 5 రోజుల్లో నలుగురు..

గుండెపోటు మరణాలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటుండటం తీవ్ర కలకలం రేపింది.

Update: 2023-03-08 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటు మరణాలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటుండటం తీవ్ర కలకలం రేపింది. తాజాగా కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో ఓ యువకుడు కన్నుమూశాడు. ఫోన్ మాట్లాడుతున్న యువకుడికి గుండెపోటు రావడంతో ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడిని శ్రీరాం నగర్ కాలనీకి చెందిన సంతోష్ (33)గా గుర్తించారు. కాగా కామారెడ్డిలో గుండెపోటుతో గత ఐదు రోజుల్లో నలుగురు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News