డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరం: మంత్రి హరీశ్ రావు

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-02-26 16:37 GMT

దిశ, ఖైరతాబాద్: మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్వీరామంగా శ్రమించిందన్నారు. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News