డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ అద్భుత విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్
తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ స్థానం పడిపోవడంపై వ్యంగ్యంగా స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ స్థానం పడిపోవడంపై వ్యంగ్యంగా స్పందించారు. మీరు సాధించిన విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ సంచలన ట్వీట్ చేశారు.
"డియర్ రేవంత్ రెడ్డి గారు అభినందనలు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని, ఊహించలేని అత్యల్ప ర్యాంక్‌కు చేర్చిన మిమ్మల్ని అభినందిస్తున్నందుకు గర్వంగా ఉంది. సాధించిన ఈ అద్భుత విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఈ స్థానానికి రావడానికి స్వచ్ఛ్ బయో, వాల్స్ కర్ర లాంటి ఆవిష్కరణలు చాలా అవసరం. తదుపరి దావోస్ సమ్మిట్‌లో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి రేవంత్ రెడ్డి వివరించాలి. కేవలం 9 నెలల్లోనే ఇంత సాధించిన మీరు రానున్న నాలుగేండ్లలో సాధించే వాటికి సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందన్న భయం కలుగుతుందని మరో సారి అభినందనలు” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను ముగించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Dear Revanth Reddy garu! I am at loss of words to describe this stupendous ‘achievement’ of yours! Firstly! Let me have the honor of congratulating you for this unthinkable feat of catapulting a state that was top rated in Ease Of Doing Business to the lowest ranking… https://t.co/TDCa4rHWPf
— KTR (@KTRBRS) September 7, 2024
(video link credits to KTR X accont)