వైద్యారోగ్య శాఖపై ఎంతో అధ్యయనం చేశా.. దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో ఐవీఎఫ్ కేంద్రాన్ని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Damodara Raja Narasimha) ప్రారంభించారు.

Update: 2024-10-15 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో ఐవీఎఫ్ కేంద్రాన్ని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Damodara Raja Narasimha) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖపై ఎంతో అధ్యయనం చేశానని అన్నారు. ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జూడాలు సమ్మెకు వెళ్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే హాస్టల్స్‌, ఇతర సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. 15 రోజుల్లో పేట్ల బురుజులో ప్రారంభిస్తామని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెలా 10వ తేదీలోగా డాక్టర్లకు స్టైఫండ్ ఇస్తున్నామని అన్నారు.

గత బీఆర్ఎస్ సర్కార్‌ వైవ్య వ్యవస్థను గందరగోళం చేసిందని మండిపడ్డారు. కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైందన్నారు. జీవోలు తీసుకొచ్చినా ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. గత పాలకుల నిర్ణయాల వల్ల నిర్వీర్యమైన తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇంత చేస్తున్నా ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా మంత్రి దామోదర రాజనర్సింహ అంటూ ధ్వజమెత్తారు.


Similar News