Daggubati Purandeswari :బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు పురంధరేశ్వరి.. రాష్ట్ర నేతలతో చర్చ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. జూలై 8వ తేదీన తెలంగాణలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది.

Update: 2023-06-28 07:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. జూలై 8వ తేదీన తెలంగాణలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. కాగా ఈ మీటింగ్ సమన్వయ బాధ్యతలను కేంద్ర పార్టీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల పై రాష్ట్ర నేతలతో ఆమె చర్చించారు. జూలై 8వ తేదీన సమావేశం నేపథ్యంలో.. జూలై 7 సాయంత్రమే ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Read more: BRSకు మరో కీలక నేత షాక్!

Tags:    

Similar News