CS Shanthikumari : ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసిన సీఎస్ శాంతికుమారి
CS Shanthikumari recorded details in a door-to-door survey
దిశ, వెబ్ డెస్క్ : కులగణన(Caste census)సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి(CS Shanthikumari) తన కుటంబ వివరాలు నమోదు చేశారు. ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలు అందించి నమోదు చేయించారు. రాష్ట్రంలో కులగణన కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఇప్పటికే కోటి కుటుంబాలకు పైగా వివరాలను నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన మొదలైన ఇంటింటి సర్వే 17వ రోజు శనివారం నాటికి 90శాతం పూర్తి కాగా, ఏడు జిల్లాల్లో 100శాతం పూర్తయ్యింది.
కులగణన సర్వే భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మేలు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఆయా వర్గాలు కులగణన సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో సర్వే కొంత నెమ్మదిగా సాగుతోంది.