కొత్త సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన CS ఫుల్ హ్యాపీ
తన 34 ఏళ్ల ఉద్యోగ ప్రయాణంలో అద్భుతమైన కొత్త కార్యాలయంలో కూర్చుని పనిచేసే అవకాశం తొలిసారిగా వచ్చిందని సీఎస్శాంతికుమారి ఆనందం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తన 34 ఏళ్ల ఉద్యోగ ప్రయాణంలో అద్భుతమైన కొత్త కార్యాలయంలో కూర్చుని పనిచేసే అవకాశం తొలిసారిగా వచ్చిందని సీఎస్శాంతికుమారి ఆనందం వ్యక్తం చేశారు. నూతన సచివాలయంలో మొట్ట మొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్బీఆర్అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్స్వాగతోపన్యాసాన్ని చేశారు. దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి ప్రభుత్వ ఉద్యోగులంతా చిత్త శుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ సచివాలయం పై భాగంలో అమర్చిన 34 డోములు, గోడలకు పొదిగిన ఢోల్పూర్ స్టోన్స్, 8 ఎకరాల సువిశాలమైన లాన్స్, ఫౌంటైన్స్‌లతో సచివాలయం ప్రస్తుతం టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిందన్నారు. కరోనా ప్రభావాన్ని అధిగమించి, భవన నిర్మాణాన్ని 2 సం. 90 రోజుల రికార్డ్ సమయంలో పూర్తిచేయడం గొప్ప విషయమన్నారు. హిందూ, దక్కనీ, కాకతీయుల సాంప్రదాయల అద్భుత సమ్మిళితంగా నిర్మించిన సచివాలయ భవనం, 28 ఎకరాల విస్తీర్ణంలో, 10.52 లక్షల చదరపు అడుగులతో, 265 అడుగుల ఎత్తుతో, లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ మరియు 6 అంతస్తులలో నిర్మితమై రాష్ట్రానికే ఒక ఐకాన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుత సచివాలయ భవన నిర్మాణానికి రాళ్ళెత్తిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు.