రాష్ట్రంలో లైంగిక దాడులు పెరుగుతున్నయ్: Tammineni

రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2022-12-04 14:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్ సీయూలో విదేశీ విద్యార్థినిపై, వరంగల్‌లో లా విద్యార్థినిపై, హైదరాబాద్‌లోని స్కూల్లో నాలుగేళ్ల బాలికపై, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తండాలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనలు సభ్యసమాజాన్ని నివ్వెర పరుస్తున్నాయని పేర్కొన్నారు. నిందితులకు వెంటనే శిక్షలు పడేట్లు చూడాలని, షీటీమ్స్ రాష్ట్రమంతా విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళల స్థాయిని దిగజార్చే అంశాలు, వ్యాఖ్యానాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News