ఏచూరి అంత్యక్రియల విషయంలో CPIM సంచలన నిర్ణయం

కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నాయకుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) కన్నుమూసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-12 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నాయకుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల‌(AIIMS Hospital)లో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు కొన్ని రోజుల నుంచి అక్కడే చికిత్స చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. శ్వాస‌కోస స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న ఏచూరి ఇవాళ మ‌ర‌ణించిన‌ట్లు ఆ పార్టీ ప్రక‌టించింది. ఇదిలా ఉండగా.. ఏచూరి అంత్యక్రియల విషయంలో సీపీఐఎం(CPIM) కీలక నిర్ణయం తీసుకుంది. అంత్యక్రియలు ఉండవని ప్రకటించించింది.

తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలోనే ఏచూరి కోరారు. దీంతో వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని కళాశాలకే కుటుంబసభ్యులు అప్పగించేందుకు అంగీకరించారు. దీంతో సీతారాం ఏచూరి కోరిక మేరకు ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగిస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు(Raghavulu) తెలిపారు. కాగా, వీపీ సింగ్ నేతృత్వంలోని నేష‌న‌ల్ ఫ్రంట్, యునెటెడ్ ఫ్రంట్ కూట‌మి ప్రభుత్వ ఏర్పాటులో ఏచూరి కీల‌క పాత్ర పోషించారు. ఆ స‌మ‌యంలో ప్రభుత్వానికి సీపీఎం బ‌య‌టి నుంచి మ‌ద్దతు ఇచ్చింది.


Similar News