బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కలిస్తే మరీ మంచిది: సీపీఐ

రాష్ట్రంలో పొత్తుల అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కలిసి వచ్చే వారిపై ప్రధాన పార్టీల మధ్య పొత్తుల మాట వినిపిస్తోంది.

Update: 2023-04-07 12:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పొత్తుల అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కలిసి వచ్చే వారిపై ప్రధాన పార్టీల మధ్య పొత్తుల మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే తాము స్వాగతిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కలిసిన వచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. సీపీఎం, సీపీఐలు ఒకే తల్లి బిడ్డలాంటివని ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని చెప్పారు.

కందాల, రేగా కాంతారావు ఎవరి ఓట్లతో గెలిచారో బీఆర్ఎస్ ఆత్మసాక్షికే వదిలేస్తున్నామని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న వారిపై ఉపా చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టొద్దన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ, హస్తం పార్టీలు కలిసి వస్తే స్వాగతిస్తామని కూనంనేని వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News