‘తెలంగాణలో సీపీఐ వల్లే కాంగ్రెస్‌ గెలిచిందని నేను చెప్పలేదు’

నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చెందారు.

Update: 2023-12-19 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చెందారు. తెలంగాణలో సమిష్టి కృషితోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. కేవలం సీపీఐ వల్లే గెలిచిందని తాను ఎక్కడా చెప్పలేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని.. మిగతా రాష్ట్రాల్లోనూ తమతో పొత్తు పెట్టుకున్న వారే గెలుస్తాని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని.. తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో తమ పార్టీ ప్రభావం ఉందని.. అందుకే కాంగ్రెస్ ఈజీగా గట్టెక్కిందని సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో నారాయణ స్పందించి.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..