CPI Narayana: ఢిల్లీ కాలేజీకి సవార్కర్ పేరా..? గాడ్సే పేరుకూడా పెడతారు.. సీపీఐ నారాయణ ఫైర్

చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు.

Update: 2025-01-03 08:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా స్థాపించబోయే (Delhi college) ఢిల్లీ కాలేజీకి సవార్కర్ పేరా..? అంటూ ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సవార్కర్ (Savarkar) పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దేశ రాజధానిలో అవతరించే విద్యాలయానికి పెట్టాల్సిన పేరు ఇదేనా? అని నిలదీశారు.

సెక్యులర్ భావాలు, సర్వమత సమాధికారం అనేవి భారతసమాజపు విలువలకు వెన్నెముక వంటివని తెలిపారు. వాటిని వ్యతిరేకించి ఉద్యమాలు చేసి, చివరకు మహాత్ముని హత్య కేసులో కూడా ఒక నిందుతుడిగా అనుమానించబడ్డ సవార్కర్ పేరా? సరస్వతీ నిలయానికి పెట్టవలసిన పేరు? అంటూ మండిపడ్డారు. ఇది చూసి చూడకుండా ఉంటే గాడ్సే పేరును కూడా ఏ విశ్వవిద్యాలయాలకో, ఉన్నత సంస్థలకో కూడా పెట్టే అఘాయిత్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగలదని తీవ్ర స్థాయిలో సీపీఐ తరపున తమ వ్యతిరేకాన్ని వ్యక్తం చేశారు .

Tags:    

Similar News