CPI Narayana: అక్రమ కట్టడాల కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ నగర శివార్లలో చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేయడం సమర్ధనీయమేనని సీపీఐ నేత నారాయణ అన్నారు.

Update: 2024-08-26 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివార్లలో చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేయడం సమర్ధనీయమేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల్లో భాగంగా పేద, మధ్య తరగతి జనం కూడా ఇళ్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు. వారందరికీ ప్రభుత్వమే ప్రత్నామ్నాయం చూపించాలని కోరారు. ‘హైడ్రా’ ఏర్పాటుతో సీఎం రేవంత్‌రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని, దిగితే పులి మింగేసే ప్రమాదం లేకపోలేదని కామెంట్ చేశారు. అదేవిధంగా చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు కూల్చివేతలకు ప్రభుత్వ కార్యాలయాలతో కార్పొరేట్ శక్తులు ముడిపెడుతున్నాయని, ఇదో జఠిల సమస్య అని పేర్కొన్నారు. ఆ అశంపై వెంటనే ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బావుంటుందని నారాయణ అన్నారు.     


Similar News