ఎన్ కన్వెన్షన్ వద్దకు సీపీఐ నారాయణ.. సీఎం రేవంత్ మీద సంచలన వ్యాఖ్యలు

భూఆక్రమణ దారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది.

Update: 2024-08-25 10:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : భూఆక్రమణ దారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని స్థలాలని ఆక్రమించిన వారిని ఎవ్వరినీ వదలడం లేదు. తెలుగు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువు శిఖం భూముల్లో ఉండటంతో హైడ్రా దానిని కూల్చివేసింది. అయితే ఈ కన్వెన్షన్ స్థలానికి సీపీఐ నేత నారాయణ వెళ్లారు. ఈ సందర్భంగా.. సీపీఐ నారాయణ హైడ్రా కూల్చివేతల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జా దారులను కేవలం బుసలు కొట్టి తర్వాత సైలెంట్ గా వదిలి పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారిని వెంటాడి తరుముతోందని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను తాను పూర్తిగా సమర్తిస్తున్నాను అని తెలిపిన నారాయణ.. నాగార్జున మంచి నటుడే కావచ్చు, కాని ఇదేం కక్కుర్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఉంటే నేనే కూలుస్తాను అని సినిమా డైలాగులు కొట్టడం కాదు, ముందు చేసిన తప్పుకు నాగరార్జున సారీ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఇలా చెరువులు కాలువలు కబ్జా చేయడం వలనే చిన్న వర్షానికి కూడా హైదరాబాద్ నగరం వరదల్లో మునుగుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం చేసినన్ని భూకబ్జాలు మరెవరూ చేయలేదని, వెంటనే వాటిని కూల్చివేసి, ఆ స్థలాలు స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు... దీనిని ఇలాగే పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగించాలి అన్నారు. హైదరాబాద్ లోని చెరువులన్నీ ఖాళీ చేయించాలని రేవంత్ ను కోరుతున్నానని నారాయణ పేర్కొన్నారు.     


Similar News