భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాం: CPI

మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసి అద్భుతమైన ఫలితం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

Update: 2022-11-25 05:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసి అద్భుతమైన ఫలితం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం చేసినంత కాలం తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అమిత్ షా వస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద కేసులో అమిత్ షా కు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని కూనంనేని ప్రశ్నించారు. బండి సంజయ్ చట్టాలు తెలియని అజ్ఞాని అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News