వాటర్ బాటిల్‌పై రూ.5 అధికంగా వసూలు.. రూ.55వేలు ఫైన్ వేసిన కోర్టు
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకూ ప్రజల్లో ప్రశ్నించేతత్వం ఇంతకింతకూ తగ్గిపోతోంది. హోటళ్లకి వెళ్లి భోజనం చేసిన తర్వాత అధిక ధరలు వసూలు చేసినా.. చెల్లించడం.. పార్కింగ్ రుసుము పేరుతో దోపిడీ
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకూ ప్రజల్లో ప్రశ్నించేతత్వం ఇంతకింతకూ తగ్గిపోతోంది. హోటళ్లకి వెళ్లి భోజనం చేసిన తర్వాత అధిక ధరలు వసూలు చేసినా.. చెల్లించడం.. పార్కింగ్ రుసుము పేరుతో దోపిడీచేస్తున్నా పట్టించుకోకపోవడం ఇలాంటివి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఈ విధంగానే వాటర్ బాటిల్ పై రూ.5 అధికంగా తీసుకున్నందుకు రెస్టారెంట్ వారితో ఎదురించి కన్స్యూమర్ కోర్టుకు వెళ్లి రూ.55వేల ఫైన్ విధించే వరకూ పోరాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ని ఉస్మానియా యూనివర్సిటీ గౌతమి హాస్టల్లో ఉంటున్న వంశీ.. ఫ్రెండ్స్‌తో కలిసి తిలక్ నగర్‌లోని లక్కీ బిర్యాని సెంటర్‌కు వెళ్లాడు. బిర్యానితో పాటు ఓ వాటర్ బాటిల్‌ను ఆర్డర్ చేసిన వంశీ.. వాటర్ బాటిల్‌పై అధనంగా రూ.5.50 వసూలు చేయడంపై రెస్టారెంట్ వారిని ప్రశ్నించారు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది వంశీపై దురుసుగా ప్రవర్తిస్తూ పరుష పదజాలం వాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ.. వెంటనే హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్-2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా వంశీపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేశారని గుర్తించిన న్యాయస్థానం.. బిల్లుపై అదనంగా వసూలు చేసిన రూ.5.50కి 10శాతం వడ్డీతో పాటు రూ.5వేలు పరిహారం చెల్లించాలని రెస్టారెంట్ యాజమాన్యానికి ఆదేశించింది. అంతేకాకుండా, జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమం కోసం రూ.50వేలు చెల్లించాలని వెల్లడించింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ధర్మాసనం సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని మందలిస్తూ.. జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.