రసాభాసగా బాన్సువాడ సేవాలాల్ జయంతి ఉత్సవాలు.. అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే పోచారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంత్రి కార్యక్రమాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది.

Update: 2024-02-27 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బాన్సవాడలో తలపెట్టిన సేవాలాల్ జయంతి కార్యక్రమం తీవ్ర రసాభాసకు దారి తీసింది. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వేదికపైకి రావడం ఏంటని ఎమ్మెల్సే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. అందుకు ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అధికారులు ఆయనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే పోచారం అర్థంతరంగా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. 

Tags:    

Similar News