శ్రీ రాముడు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు షాక్ తగిలింది. మే 5న రాహుల్ గాంధీ పాల్గోన ఆదిలాబాద్ సభలో శ్రీ రాముడు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-08 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు షాక్ తగిలింది. మే 5న రాహుల్ గాంధీ పాల్గోన ఆదిలాబాద్ సభలో శ్రీ రాముడు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పీఎస్‌లో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆదిలాబాద్ సభలో అద్దంకి మాట్లాడుతూ.. నేడు తెలంగాణలో బీజేపీ, ఇతరులు హిందువులం రాముని వారసులు అని అంటున్నారు. మీరు ఏ విధంగా రాముని వారసులు అవుతారు. రాముడు మీ చిన్నాయన, సీత మీ చిన్నమ్మన అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను కవాలనే వక్రీకరించారని అద్దంకి దయాకర్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News