Hanumantha Rao: రేవంత్ మాటను లెక్కచేయని వీహెచ్.. అనూహ్యంగా బేగంపేటలో ప్రత్యక్షం
Congress Senior Leader Hanumantha Rao Welcomes Yashwant Singh At Begumpet Airport In Hyderabad| విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పటు పలువురు టీఆర్ఎస్
దిశ, వెబ్‌డెస్క్: Congress Senior Leader Hanumantha Rao Welcomes Yashwant Singh At Begumpet Airport In Hyderabad| విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము కలవం అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హన్మంతరావు కలవడం చర్చనీయంశంగా మారింది. అధ్యక్షుడి మాటను లెక్కచేయకుండా వీహెచ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో కాంగ్రెస్‌లో చిచ్చు చెలరేగింది.