బిగ్ న్యూస్: అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ భారీ ప్లాన్!
పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్.. ఈసారి చేజిక్కించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడంలేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్.. ఈసారి చేజిక్కించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడంలేదు. వచ్చే ఎన్నికల్లో గెలవక పోతే ఆ తర్వాత పార్టీ మనుగడ కష్టంగా మారుతుందనేది నేతలు అభిప్రాయం. దీంతో 9 డిక్లరేషన్లను గ్రాండ్ సక్సెస్చేయాలని హస్తం ఆశలు పెట్టుకుంది. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి నేతలంతా ఆశల్లో పడిపోయారు. కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో లీడర్లు, కేడర్తెలంగాణలోనూ కాంగ్రెస్‌జెండా ఎగరవేసుందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
స్థానిక నేతలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఢిల్లీలోని ఏఐసీసీ ముఖ్య లీడర్ల సాయం కూడా టీపీసీసీ తీసుకోనుంది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్జాతీయ నేతల వరుస పర్యటనలు షురూ కానున్నాయి. సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్‌తో పాటు మల్లికార్జున్‌ఖర్గే, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమారి, ముగ్గురు ఓబీసీ ముఖ్యమంత్రులు, ఏడు రాష్ట్రాల కాంగ్రెస్అధ్యక్షులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. టీపీసీసీ కార్యవర్గంతో కలిసి కాంగ్రెస్నిర్వహించే ప్రచారం, సభల్లో వారంతా పాల్గొననున్నారు.
మీకేం కావాలి..?
ఇప్పటికే కాంగ్రెస్ రైతు, యూత్ డిక్లరేషన్లను విడుదల చేసింది. ఎన్నికల్లోపు మరో 7 డిక్లరేషన్లను ప్రకటించనుంది. వీటిన్నింటిని కలిపి మ్యానిఫెస్టోగా సెప్టెంబరు 17న రిలీజ్చేసేందుకు సిద్ధమైంది. అయితే డిక్లరేషన్‌లో పొందుపరిచే అంశాలను ప్రజల నుంచి సేకరిస్తుంది. మీకేం కావాలి ? దీర్ఝకాలిక సమస్యలు ఏమున్నాయి? మెజార్టీ మెంబర్లు లబ్ధి పొందే స్కీమ్లేంటి? ఇలా 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ఇంటర్నల్సర్వే చేయిస్తుంది.
మెజార్టీ ప్రజల సమస్యలు, అవసరాలను డిక్లరేషన్లలో పొందుపరచనుంది. యువత, నిరుద్యోగులు, రైతులు, కుల సంఘాలు, కార్మికులు కేటగిరీల వారీగా అవసరాలను తెలుసుకోనుంది. దీంతో పాటు మేధావివర్గం, ఎక్స్పర్ట్స్, సొసైటీ సేవకుల నుంచి కూడా ఫీడ్బ్యాక్తీసుకోనుంది. వీటన్నింటినీ జత చేస్తూ డిక్లరేషన్‌ను ప్రకటించనుంది.
డ్యామేజ్ చేసేలా..
కాంగ్రెస్ డిక్లరేషన్లను బేస్‌చేసుకొని ఇతర పార్టీలను డ్యామేజ్చేసేలా ప్లాన్లు సిద్ధం చేసుకుంది. ఇటీవల రాహుల్ఆధ్వర్యంలో రైతు, ప్రియాంక సమక్షంలో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించినది తెలిసిందే. త్వరలో సోనియా గాంధీ సమక్షంలో మహిళా డిక్లరేషన్వెల్లడించనుంది. సంఖ్య పరంగా రిజర్వేషన్లు, మహిళా సాధికారత, అమ్మాయిలు, గృహిణుల రక్షణ వంటి ప్రోగ్రామ్స్‌కు శ్రీకారం చుట్టేందుకు ప్లాన్లు రూపొందిస్తుంది. అంతేగాక సిటీ బస్సుల్లో ఉచిత జర్నీ, నెలవారీ పింఛన్, వంట గ్యాస్ సిలిండర్లకు రాయితీ వంటి అంశాలను పొందుపరిచే చాన్స్ఉందని కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.
కమ్యూనిటీ వారీగా..
ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను మాజీ లోక్‌సభ స్పీకర్మీరా కుమారి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే ఆధ్వర్యంలో ప్రకటించనుంది. గిరిజనులు రిజర్వేషన్, దళితుల డెవలప్ మెంట్, విద్యా, ఉపాధి, వైద్యం వంటిపై స్పెషల్ప్యాకేజీలను డిక్లరేషన్‌లో పొందుపరిచే చాన్స్ ఉంది. విదేశాల్లో ఎస్సీ, ఎస్టీల ఎంపవర్మెంట్, స్వయం ఉపాధి, సబ్సిడీ లోన్లు వంటివి పేర్కొననుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్పొరేట్ స్థాయి కంపెనీల్లోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్తించేలా తగిన రూల్‌ను తీసుకొచ్చేందుకు డిక్లరేషన్‌లో పొందుపరచనుంది.
బీసీ, ఓబీసీ డిక్లరేషన్‌ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 60 శాతం జనాభా కలిగిన కమ్యూనిటీకి ఎక్కువ మొత్తంలో అంశాలను డిక్లరేషన్‌లో పెట్టాలని కాంగ్రెస్భావిస్తుంది. కుల జనగణన, సెల్ఫ్ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లు, ఉపాధి, వివిధ ఎంఎన్సీలతో నేరుగా ప్రభుత్వమే సమన్వయమై ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోనుంది. అయితే బీసీ, ఓబీసీ డిక్లరేషన్లను ఏకంగా కాంగ్రెస్ముఖ్యమంత్రులుగా ఉన్న ముగ్గురితో ప్రకటించాలని పార్టీ లక్ష్యం పెట్టుకుంది.
హైదరాబాద్ మాస్టర్ పాలసీ..
గ్రేటర్హైదరాబాద్పై కాంగ్రెస్ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను డిక్లరేషన్రూపంలో విడుదల చేయనుంది. మూసీ సుందరీకరణను ప్రధాన ఎజెండా కింద ప్లాన్ పొందుపరచనుంది. అంతేగాక నాలా ఎక్స్టెన్షన్ వంటివి కూడా అమలు చేయనుంది. దీంతో పాటు అక్రమ నిర్మాణాల కూల్చివేత, అభాగ్యులకు ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి అంశాలను కూడా మాస్టర్పాలసీ డిక్లరేషన్‌లో పెట్టనుంది.
మరో మూడు డిక్లరేషన్లలో ఏ అంశాలు పెడితే బాగుంటుందని? కాంగ్రెస్రీసెర్చ్చేస్తుంది. పెరిగిన ఇంటర్నెట్‌సేవలు తప్పనిసరి కావడంతో ఉచితంగా ఇచ్చే అంశాన్ని కూడా ఆలోచిస్తుంది. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లను కూడా పొందుపరచాలని పార్టీ వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్తీసుకుంటుంది. దీన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో పాటు ఢిల్లీకి చెందిన ఏఐసీసీ ముఖ్య లీడర్లంతా రిలీజ్ చేస్తారు.
Read more:
బిగ్ న్యూస్: కర్నాటక రిజల్ట్‌తో KCR టార్గెట్ చేంజ్.. ఇకపై సీఎం ఫోకస్ ఆ పార్టీపైనే..?