ఈటల మంత్రి ఉండగానే బియ్యం స్కాం..! కాంగ్రెస్ ఛార్జ్ షీట్లో సంచలన ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైమ్ ఛార్జ్‌షీట్ రిలీజ్చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ ఫస్ట్‌టైమ్ ఛార్జ్‌షీట్ రిలీజ్ చేసింది.మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై పార్టీ 9 అంశాలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. దీనిలో ఆయన సివిల్ సప్లై మినిస్టర్‌గా ఉన్నప్పుడు బియ్యం స్కామ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఛార్జ్‌షీట్‌లో పొందుపరచడం గమనార్హం. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనంటూ పేర్కొన్నది. చీకటి వ్యాపారాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటూ బీఆర్ఎస్, బీజేపీలు ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రజల కోసం ఈటల ఎలాంటి పోరాటాలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసమే తపన పడుతూ ఈటల పార్టీ మారినట్లు తెలంగాణ కాంగ్రెస్కమిటీ పేర్కొన్నది.
ఈటల ఛార్జ్షీట్లోని కాంగ్రెస్పొందుపరిచిన అంశాలు ఇవే..
‘‘ఉప ఎన్నికల్లో తనకు మద్ధతివ్వని ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్వేధింపులకు గురి చేసిండు. ఓ ఉద్యోగి మరణానికి కారణమైండు. వేరే పార్టీలకు మద్ధతిచ్చిన వారిని పోలీసులతో వేధిస్తుండు. అక్రమాలను ప్రశ్నించినందుకు నర్సింగాపూర్ఎంపీటీసీని చంపించాడని ఆరోపణలున్నాయి. అందుకే గ్రామస్థులు కాన్వాయ్ అడ్డుకొని ఊళ్లోకి రానివ్వలే.
హుజూరాబాద్ చైర్పర్సన్ భర్త దగ్గరి నుంచి రూ. కోటి లంచం తీసుకొని ఛైర్పర్సన్ సీటు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తన పీఏ కరుణాకర్సహాయంతో ఒక్కోక్క యువకుడి వద్ద నుంచి రూ. 5 లక్షలు వసూళ్లు చేసి మోసం చేసిండు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అనేక మంది రైతులు మిర్చి పంట సాగు చేసి వర్షాలు, తెగుళ్లు కారణంగా తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోలే. మంత్రిగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇండ్ల ఊసే ఎత్తలే. కేవలం పెద్ద మీటింగ్‌లు ఉంటేనే హుజూరాబాద్ వచ్చేటోడు. ఈటెలపై అనేక భూ దోపిడీ ఆరోపణలున్నాయి.
తుర్కయంజల్, కొంపల్లి ప్రాంతాలలో వందల ఎకరాలు ఆక్రమించిండు. దోచుకున్న డబ్బుతో ఒంటిమామిడిలో ఆర్వీఎం మెడికల్‌కాలేజీ నిర్మించిండు. కెమికల్ఫ్యాక్టరీ గుంజుకొని బీర్లు ఉత్పత్తి చేయిస్తుండు. కమాలాపూర్‌లో ఒకప్పుడు కేవలం రెండెకరాల భూమి ఉన్న రాజేందర్ఇప్పుడు కోట్ల రూపాయలు విలువైన వందల ఎకరాలను ఆక్రమించిండు. అసైన్డ్, దేవాదాయ భూములను కూడా కొల్లగొట్టిండు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు రైసు మిల్లర్లను మోసం చేసిండన్న ఆరోపణలు వచ్చినాయి. బాధితులు ప్రెస్మీట్లో ఈ విషయాలు వెల్లడించారు.
మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్టళ్లకు పౌల్ట్రీ నుంచి అధిక ధరకు గుడ్లను సరఫరా చేసి రూ. కోట్లు దోచుకున్నడు. హుజూరాబాద్నియోజకవర్గంలో ద్వితీయ క్యాడర్ని రాజకీయంగా ఈటల ఎదగనివ్వడంలే. మాజీ దళ కమాండర్పోచమల్లుపై అక్రమ కేసులు బనాయింపజేసిండు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్యాస్‌ప్లాంట్, జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో భారీగా కమీషన్లు తీసుకున్నాడు” అంటూ కాంగ్రెస్ పార్టీ ఈటలపై విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌లో హైలెట్ చేస్తూ పొందుపరిచింది.